ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సందర్భాలు, రోజులు ఎంతో ప్రత్యేకమైనవిగా ఉంటాయి. అలాంటి సందర్భాలను మరింత ప్రత్యేకముగా దేవుని వాక్యమును నేర్చుకుంటూ, సభ్యులందరితో కలిసి గుర్తుండిపోయేలా జరుపుకోవాలనే ఉద్దేశముతో ఈ స్పెషల్ క్విజ్ లు రూపొందించబడ్డాయి.
మీరు మీ పుట్టినరోజు, కుటుంబ సభ్యుడి ప్రత్యేకమైన రోజు లేదా ఏదైనా ఆనందకరమైన సందర్భం కోసం బైబిల్ క్విజ్ నిర్వహించాలని అనుకుంటే, బైబిల్ క్విజ్ టీమ్‌ను సంప్రదించవచ్చు. మీ కొరకు మీ యూసర్ ఐడి తో మీరు ఇచ్చిన క్విజ్ ను మేమే పోస్ట్ చేస్తాము.
మీ యూసర్ ఐడితో రూపొందించిన స్పెషల్ క్విజ్‌లు మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి. ఇది మీ వ్యక్తిగత ప్రత్యేక క్విజ్‌లకు ఒక ప్రత్యేక స్థలంగా పనిచేస్తుంది.
క్విజ్ టాపిక్, ప్రశ్నల రూపకల్పన, సమయ పరిమితి మరియు విజేత నిర్ణయ విధానం — ఇవన్నీ మీ అవసరాలకు అనుగుణంగా రూపొందించబడతాయి. ఇప్పటికే ఉన్న నియమాలకు భిన్నంగా ఏదైనా ప్రత్యేక విధానం కావాలనుకుంటే, బైబిల్ క్విజ్ టీమ్ మీ సౌకర్యానికి తగిన విధంగా మార్పులు చేస్తుంది.
ఈ విధంగా ఈ స్పెషల్ క్విజ్‌లు ఒక ప్రత్యేక సంబరాన్ని మరింత ప్రత్యేకముగా మరియు ఆత్మీయ అనుభవంగా మార్చుతాయని ఆశిస్తున్నాము. మీ ప్రత్యేక రోజును దేవుని వాక్యంతో మరింత ప్రత్యేకంగా మార్చాలనుకుంటే, మన వెబ్సైటు లోని స్పెషల్ క్విజ్ ఆప్షన్ ని వినియోగించుకోవాలని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాము.