"నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను.."


"నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది."



దేవునికి స్తోత్రములు!!! మన ప్రభువైన యేసు క్రీస్తు మహిమగల నామంలో TheBibleQuiz.in వెబ్‌సైట్‌కు హృదయపూర్వక స్వాగతం.

📖 వెబ్‌సైట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం:

TheBibleQuiz.in వెబ్‌సైట్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ప్రతి విశ్వాసి ప్రతిరోజూ బైబిల్ చదవడానికి, అర్థం చేసుకోవడానికి మరియు ఆచరించునట్లుగా ప్రోత్సహించడం.

ప్రతి రోజు ఒక అధ్యాయం ఆధారంగా రూపొందించబడుచున్న క్విజ్‌ల ద్వారా, బైబిల్ చదవడం ఒక ఆనందకరమైన రోజువారీ అలవాటుగా మారాలని మా ఆకాంక్ష. బైబిల్‌ను కేవలం చదవడమే కాకుండా, దానిని అర్థం చేసుకొని, దేవుని వాక్యంలో స్థిరపడేందుకు ఈ క్విజ్‌లు మీకు సహాయపడతాయి అని భావిస్తున్నాము. ఈ విధంగా మీరు దేవుని జ్ఞానం, విశ్వాసం మరియు ఆధ్యాత్మిక అవగాహనలో రోజు రోజుకు ఎదగాలని మా ప్రార్ధన.

🧠 బైబిల్ క్విజ్‌లు - ప్రాముఖ్యత:

ఈ రోజుల్లో మనం చదివిన విషయాలను త్వరగా మర్చిపోతున్నాం.

క్విజ్‌ల రూపంలో బైబిల్ అధ్యయనం చేయడం వలన:

  • చదివిన అధ్యాయం మీద స్పష్టత పెరుగుతుంది.
  • ముఖ్యమైన వాక్యాలు జ్ఞాపకంలో నిలుస్తాయి.
  • దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాలనే ఆసక్తి పెరుగుతుంది.
  • వ్యక్తిగతంగా మరియు కుటుంబంగా బైబిల్ అధ్యయనం చేయడానికి సహాయపడుతుంది.

🗂️ మన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న క్విజ్‌లు:

రోజువారీ క్విజ్‌లు (Daily Quiz):
  • రోజువారీ క్విజ్‌లు ప్రతి రోజు ఒక అధ్యాయం ఆధారంగా రూపొందించబడతాయి.
  • ప్రతిరోజు బైబిల్ చదవడానికి మరియు దేవుని వాక్యాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి రోజువారీ క్విజ్‌లు ఎంతగానో ఉపయోగపడతాయని భావిస్తున్నాము.
వీక్లీ క్విజ్‌లు (Weekly Quiz):
  • ఆ వారం మొత్తం ప్రచురించిన రోజువారీ క్విజ్‌ల ఆధారంగా ఉంటాయి.
  • ఆ వారములో మనము నేర్చుకున్న విషయాలను గుర్తుచేసుకోవడం ద్వారా మనము మర్చిపోకుండా ఉంటాము.
  • మన వెబ్సైటు లోని నియమముల ఆధారముగా విజేతను ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
నెలవారీ క్విజ్‌లు (Monthly Quiz):
  • ఆ నెలలో ఉన్న రోజువారీ మరియు వారంవారీ క్విజ్‌లపై ఆధారపడి రూపొందించబడతాయి.
  • వీక్లీ క్విజ్‌ల వలె నెలవారీ క్విజ్ లకు కూడా విజేతను ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
ప్రత్యేక క్విజ్‌లు (Special Quiz):
  • జన్మదినాలు, ప్రత్యేక కార్యక్రమాలు లేదా ఇతర ఆత్మీయ సందర్భాలలో దేవుని వాక్యాన్ని నేర్చుకునే ఉద్దేశంతో ఈ స్పెషల్ క్విజ్‌లు నిర్వహించబడతాయి.
  • విజేతల ఎంపిక ఈ క్విజ్ నిర్వహించేవారు ఎంచుకున్న నియమాలను బట్టి ఉంటుంది.
చర్చి క్విజ్‌లు (Church Quiz):
  • చర్చి పాస్టర్లు లేదా చర్చి నిర్వాహకులు వారి వారి సంఘములలో క్విజ్ లు నిర్వహించుకోడానికి ఇవి ఉపయోగపడతాయి.
  • క్విజ్ నిర్వహిచువారు వారి ప్రాధాన్యతల ఆధారంగా విజేతను ఎంపిక చేసుకోవచ్చు.

🚀 క్విజ్‌ను ఎలా ప్రారంభించాలి?:

  • మీరు ఒకవేళ లాగిన్ చేసి ఉంటె, ఏదైనా క్విజ్ ని సెలెక్ట్ చేసినప్పుడు, Start the quiz ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ ని క్లిక్ చెయ్యడం ద్వారా క్విజ్ ని రాయవచ్చు. లేకుంటే మన వెబ్సైటు లో సైన్ అప్ చేసినప్పుడు, ఒక యూజర్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ తో లాగిన్ అయి క్విజ్ ని రాయవచ్చు.
  • లాగిన్ చేయనివారు Guest గా కూడా క్విజ్ ని రాయవచ్చు. దీనికొరకు Continue as Guest అను ఆప్షన్ ని క్లిక్ చెయ్యడం ద్వారా క్విజ్ ని రాయవచ్చు.
  • ప్రతి క్విజ్‌కు సంబంధించిన నియమాలను ఇక్కడ క్లిక్ చెయ్యడం ద్వారా చూడవచ్చు.

ఇది ఒక చిన్న ప్రయత్నం — ఇది విశ్వాసులకు దేవుని వాక్యంలో స్థిరంగా ఉండటానికి సహాయం చేయాలని, మీ ఆధ్యాత్మిక జీవితానికి ఆశీర్వాదం అవ్వాలని, మరియు బైబిల్ చదవడాన్ని ఆనందకరమైన రోజువారీ అలవాటుగా మారుస్తుందని మేము ప్రార్థిస్తున్నాము. మీరు దీన్ని ఉపయోగకరంగా భావిస్తే, దయచేసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి. మీ విలువైన అభిప్రాయాలు మరియు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించడానికి ఎప్పుడైనా స్వాగతం.