Quiz Topic: Brighty birthday


1) తన తల్లి యొద్ద పాలు తాగినందుకు గాను రాజు యింటి నుండి తల్లికి జీతం ఇప్పించిన శిశువు ఎవరు?

2) స్త్రీలు కనిన వారిలో ఇతని కంటే గొప్పవాడు పుట్టలేదని ఎవరిని గూర్చి పరిశుద్ధ గ్రంధములో వ్రాయబడి ఉన్నది?

3) బాల్యము నుండి దేవునియందు భయభక్తులు కలిగి దేవుని ప్రవక్తలను దాచి పోషించిన వ్యక్తి ఎవరు?

4) బాల్యము నుండి వృద్ధాప్యము వరకు యాజకత్వము జరిగించి న్యాయాధిపతిగ ఉన్న ప్రవక్త ఎవరు?

5) సంవత్సరమును నీ ____ ధరింపజేసియున్నావు నీ జాడలు సారము వెదజల్లుచున్నవి.

6) జ్ఞానముగల కుమారుడు తండ్రిని ____ పరచును బుద్ధిలేని కుమారుడు తన తల్లికి ____ పుట్టించును.

7) గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వారికి తండ్రి ఎవరు?

8) ఎర్రని వాడును ఒళ్లంతయు రోమ వస్త్రము వలె నుండి తల్లి గర్భము నుండి బయటకు వచ్చినది ఎవరు?

9) దేవాలయంలో బోధకులు మధ్య కూర్చుండి వారితో తర్కించినప్పుడు యేసు వయస్సు ఎంత?

10) ఏ రాజు తన జన్మదినమున భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడదీయించెను?

11) క్రీస్తుకంటే ఆరు నెలలు ముందుగా దేవుని యొద్దనుండి పంపబడిన వ్యక్తి ఎవరు?

12) సమూయేలు తన బాల్యాన్ని ఎక్కడ గడిపాడు?

13) "తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి." అను వాక్యం ఎక్కడ ఉంది?

14) యూదుల రాజు పుట్టిన సంగతి విన్నప్పుడు ఎవరు కలవరపడిరి?

15) బైబిల్ ప్రకారం మొట్టమొదటిగా పుట్టిన కుమారుడు ఎవరు ?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.