Quiz Topic: 1 కొరింథీ 16, 1 నుండి 24 వచనములు వరకు


1) పరిశుద్ధులకొరకైన చందా విషయంలో పౌలు ఏ సంఘములను ఉదాహరణగా చెప్పుచున్నాడు?

2) చందా ఎప్పుడు పోగుచేయవలెనని పౌలు చెప్పుచున్నాడు?

3) యెరూషలేమునకు పంపుటకొరకు ప్రతివాడును ఎంత సొమ్ము నిలువ చేయవలెను?

4) కొరింథీయులయొద్దకు తిమోతి వచ్చినప్పుడు అతను ఎలా ఉండునట్లు చూడవలెనని పౌలు వారితో చెప్పెను?

5) తిమోతిని ఎలా సాగనంపవలెనని పౌలు వారితో చెప్పెను?

6) \'మీరు చేయు కార్యములన్నియు ప్రేమతో చేయుడి\' అను వాక్యమెక్కడ ఉన్నది?

7) పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ప్రయాసపడుచున్న వారికి మనము ఎలా ఉండవలెనని పౌలు చెప్పుచున్నాడు?

8) క్రిందివాటిని 1 కోరింథీ 16 లో చెప్పబడిన క్రమములో అమర్చుము. 1. మెలకువగా ఉండుడి 2.విశ్వాసమందు నిలుకడగా ఉండుడి 3. పౌరుషముగలవారై యుండుడి 4.బలవంతులై యుండుడి 5.మౌనముగా ఉండుడి

9) స్తెఫను ఇంటివారు ఎవరియొక్క ప్రథమఫలమై యున్నారు?

10) ఉపకారద్రవ్యమును ఎవరి చేత యెరూషలేమునకు పంపవలెనని పౌలు చెప్పెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.