Quiz Topic: 2 కొరింథీ 5, 1 నుండి 21 వచనములు వరకు


1) \'ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను\' అను వాక్యభాగమేమిటి?

2) మనమాయన (క్రీస్తు) యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన(క్రీస్తు) మనకోసము పాపముగాచేయబడెను.

3) పరలోకమందు మనకు ఎలాంటి నివాసము ఉన్నది? 1.శిథిలమైపోవునది 2.చేతిపని కానిది 3. దేవునిచేత కట్టబడినది 4.అనిత్యమైనది 5. నిత్యమైనది

4) దేవుడు మనలను ___ ద్వారా తనతో సమాధానపరచుకొని యున్నాడు?

5) జీవించువారు తమకొరకును, సంఘముకొరకును మరియు తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకును జీవించవలెను.

6) మంచివైనా, చెడ్డవైనా మనము చేసిన వాటి ఫలము పొందుటకు, మనము ఎవరి న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను?

7) మనము దేహమందున్నను దేహమును విడిచినను, ఆయన(ప్రభువు) కిష్టులమై యుండవలెను.

8) మనము ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామనియెరిగి యుండి, ___గలవారమై యున్నాము అని పౌలు చెప్పెను?

9) దేవుడు మనకు ___ అను సంచకరువును మనకనుగ్రహించియున్నాడు?

10) \'సమస్తమును దేవుని వలన కాకపోయినను\' అని పౌలు 2 కొరింథీ 5 లో ప్రస్తావించుచున్నాడు?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.