Quiz Topic: అపో. కార్యములు 26, 1 నుండి 32 వచనములు వరకు


1) అగ్రిప్ప రాజు పౌలుకు తన పక్షమున చెప్పుకొనుటకు సెలవిచ్చినప్పుడు, పౌలు ఏ విధముగా సమాధానము చెప్పసాగెను?

2) తన సమాధానములను ఏ విధముగా వినవలెనని పౌలు అగ్రిప్ప రాజును వేడుకొనెను?

3) పౌలు గతములో మతమును అనుసరించి ఎవరిగా ప్రవర్తించెనని తనను గూర్చి తాను చెప్పెను?

4) గతములో పౌలు ___ కలవాడై యెరూషలేము మరియు యితర పట్టణములకును వెళ్లి పరిశుద్ధులైనవారిని హింసించెనని చెప్పెను?

5) దమస్కు మార్గములో దర్శనము కలిగినప్పుడు, పౌలు ఏ భాషలో ఒకస్వరము వింటినని చెప్పెను?

6) ఏ సంగతినిగూర్చి పౌలును పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై యేసు దర్శనమందు కనబడెను అని చెప్పబడెను?

7) మారు మనస్సు పొంది దేవునితట్టు తిరిగి మారుమనస్సునకు తగిన క్రియలు చేయవలెనని పౌలు ఏ క్రమములో ప్రకటించెనని చెప్పెను? 1. దమస్కు 2. అన్యజనులు 3.యూదయ అంతట 4.యెరూషలేము

8) తనను పట్టుకొని చంపుటకు ప్రయత్నముచేసినను __ వలననైన సహాయము పొంది నేటివరకు నిలిచియుంటినని పౌలు అగ్రిప్పరాజుతో చెప్పెను?

9) అపో 26లో, \'నీవు వెఱ్ఱివాడవు, అతి విద్యవలన నీకు వెఱ్ఱిపట్టినదని గొప్ప శబ్దముతో\' ఎవరు ఎవరిని గూర్చి చెప్పెను?

10) అపో 26లో, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయచూచుచున్నావే అని పౌలుతో చెప్పినది ఎవరు?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.